• Login / Register
  • Telangana | తెలంగాణ‌లో 13 మంది ఐఏఎస్‌లు బ‌దిలీ

    Telangana |   తెలంగాణ‌లో 13 మంది ఐఏఎస్‌లు బ‌దిలీ
    Hyderabad : రాష్ట్రంలో మ‌ళ్లీ ఐఏఎస్ ఆఫీస‌ర్ల బ‌దిలీలు జ‌రిగాయి. ఈసారి 13 మంది ఐఏఎస్ ఆఫీస‌ర్ల‌ను బ‌దిలీ చేస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. బ‌దిలీ అయిన ఐఏఎస్ అధికారుల వివ‌రాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి క‌లెక్ట‌ర్‌గా నారాయ‌ణ రెడ్డి, న‌ల్ల‌గొండ క‌లెక్ట‌ర్‌గా త్రిపాఠి, యాదాద్రి భువ‌న‌గిరి క‌లెక్ట‌ర్‌గా హ‌నుమంత‌రావు, మున్సిపాలిటీ శాఖ డైరెక్ట‌ర్‌గా టీకే శ్రీదేవి, సీసీఎల్ఏ ప్రాజెక్టు డైరెక్ట‌ర్‌గా మందా మ‌క‌రందు, ప‌ర్యాట‌క శాఖ డైరెక్ట‌ర్‌గా జెడ్ కే హ‌నుమంతు, దేవాదాయ శాఖ డైరెక్ట‌ర్‌గా హ‌నుమంత‌కు అద‌న‌పు బాధ్య‌త‌లు, ఐ అండ్ పీఆర్ ప్ర‌త్యేక క‌మిష‌న‌ర్‌గా ఎస్ హ‌రీశ్‌, విప‌త్తు నిర్వ‌హ‌ణ శాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి హ‌రీశ్‌కు అద‌న‌పు బాధ్య‌త‌లు, ఆర్ అండ్ ఆర్, భూసేక‌ర‌ణ క‌మిష‌న‌ర్‌గా విన‌య్ కృష్ణా రెడ్డి, వాణిజ్య ప‌న్నుల శాఖ అద‌న‌పు క‌మిష‌న‌ర్‌గా నిఖిల్ చ‌క్ర‌వర్తికి అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అలాగే డెయిరీ కార్పొరేష‌న్ ఎండీగా కే చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, నిజామాబాద్ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌గా ఎస్ దిలీప్ కుమార్ నియ‌మితుల‌య్యారు.
    *  *  * 

    Leave A Comment